ఈ లైన్ అప్ ఏ హీరోయిన్ కి లేదు…

పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌. తెలుగు నుంచి మొదలైన ఈ కన్నడ అమ్మాయి హవా… టాలీవుడ్ నుంచి తమిళ, హిందీ సినిమాలకి ఎక్స్టెండ్ అయ్యింది. స్టార్ హీరోలతో నటిస్తున్న పూజ ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. అయినా ఈమె కోసం ఇంకా కొత్త అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ క్యూ కడుతున్నారు. ఎలాగైనా డేట్స్ సర్దుబాటు చేయించి తమ సినిమాలలో నటింపచేయాలని పట్టుపడుతున్నారు. గతేడాది అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది పూజా హెగ్డే. ఆ తర్వాత బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ – రోహిత్ శెట్టి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘సర్కస్’ అలానే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో మరో సినిమా చేస్తుంది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘బీస్ట్’ మూవీతో కోలీవుడ్ లోకి కూడా రీ ఎంట్రీ ఇస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి పూజా భారీ రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇలా మూడు భాషల్లో నటిస్తూ బిజీబిజీగా సినిమాలు చేస్తోంది పూజా హెగ్డే. ఇక తనకున్న డిమాండ్ కు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా అందుకుంటుందట. ప్రస్తుతం పూజా హెగ్డే ఒక్కో సినిమాకి రూ.3.5 కోట్ల వరకు అందుకుంటుందని సమాచారం. తెలుగులో ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్న పూజాహెగ్డే.. మరో రెండు సినిమాలకి సైన్ చేసిందని సమాచారం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్న కొత్త సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. ఇప్పటికే మహేష్ తో మహర్షి సినిమా చేసింది. ఇక ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ..యూత్ స్టార్ నితిన్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కూడా పూజా హెగ్డేని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. దాదాపు పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్‌కి ఓకే అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. త్వరలో వీటికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని అంటున్నారు.