నాన్న నా సూపర్ హీరో- ప్రదీప్ మాచిరాజు

స్టార్ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు తండ్రి కరోనా కారణంగా మరణించారు. నాన్నని కోల్పోయిన బాధలో ఉన్న ప్రదీప్ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు. ‘ఐ లవ్ యు నాన్న, ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైన వాటిని చిరునవ్వుతో ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. మీకు గౌరవం కలిగించేలా నడుచుకుంటాను. నా ప్రతి నిర్ణయం వెనక ఉన్న మీరు నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. బాధతో ముక్కలైన మనస్సును ప్రేమతో బాగు చేశారు.

మీ ధైర్యం నాకు స్పూర్తినిచ్చింది. నా కాళ్లపై నేను నిలబడేలా చేసింది. మీరు నాకు ఎప్పటికి స్పెషల్. జీవితంలో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ఆపలేను. మీరు కోరుకున్నట్లుగానే ఎప్పుడూ నా చూట్టు ఉన్నవారిని, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ నవ్విస్తూనే ఉంటా. ఇక మనం కలిసే దాకా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటా నాన్న.. ఐ మిస్‌ యూ’ అంటూ ప్రదీప్ ఎంతో భావోద్వేగంతో రాసుకొచ్చాడు. తండ్రిని కోల్పోవడం ఎవరికైనా తీరని లోటే. ప్రదీప్ మాచిరాజు ఈ బాధ నుంచి బయటకి మళ్లీ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుందాం.