లేడి విలన్ లుక్ లో అనసూయ పిక్ లీక్

స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్, అటు సినిమాలు ఇటు టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మన్చి పేరు తెచ్చుకున్న అనసూయ, ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’, ”థ్యాంక్ యు బ్రదర్!’ సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమత్తగా అధ్భుతంగా యాక్ట్ చేసింది. ఈ సినిమానే అనసూయ కెరీర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. రంగస్థలం ఇచ్చిన జోష్ లో అనసూయ చాలా సినిమాలనే చేసింది.

కార్తికేయ హీరోగా నటించిన ‘చావు కబురు చల్లగా’ ‘పైన పటారం’ అనే స్పెషల్ సాంగ్‌లో రచ్చ చేసింది. అలాగే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. రంగమత్త రోల్ తనకి ఇచ్చిన సుకుమార్, అల్లు అర్జున్ తో కలిసి పుష్ప మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో కూడా అనసూయ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెగటివ్ రోల్ లో కనిపించనున్న అనసూయ, సునీల్ వైఫ్ గా నటించనుంది. క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం సికింద్రాబాడద్ లో జరుగుతోంది. ఈ సెట్స్ నుంచి అనసూయ లుక్ లీక్ అయ్యి, నెట్ లో వైరల్ అవుతూ ఉంది. హెయిర్ కట్ చేసుకుని, శారీలో కనిపిస్తున్న అనసూయ పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ‘పుష్ప’ లో అనసూయ గెటప్ చాలా కొత్తగా ఉంది, పాత కాలం ఊరి పెద్ద, జమిందారి గెటప్ లో అనసూయ కనిపించింది. రంగమత్తకి చిట్టిబాబుకి రంగస్థలం సినిమాలో ఒక మంచి కెమిస్ట్రీ ఉంటుంది, ఇప్పుడు అనసూయ-అల్లు అర్జున్ మధ్య పుష్ప ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి అనేది ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ అనే చెప్పాలి.