తారక్ ఫ్యాన్స్ కి ఏమన్న హ్యాండ్ ఇచ్చినవా జక్కన!

ఈ జనరేషన్ మాస్ హీరోస్ అనే పదానికి పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ ఇద్దరు హీరోల సినిమాలు విడివిడిగా వస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతది, అలాంటిది కలిసి వస్తే ఎలా ఉంటుంది? వీరికి దర్శక ధీరుడు రాజమౌళి కూడా కలిస్తే ఇంకెలా ఉంటుంది? ఈ ఆలోచనలకి సమాధానమే ఆర్ ఆర్ ఆర్. జక్కన్న చెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా జులై 30 2020న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రామ్ చరణ్ అల్లూరి సీత రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించనున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ హీరోల లుక్ మాత్రం బయటకి రాలేదు.

అక్టోబర్ 22న కొమరం భీం జయంతి సందర్భంగా, ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ లో ఉండబోతున్నాడో చూపిస్తారని అంతా అనుకున్నారు కానీ రాజమౌళి ఊహించని షాక్ ఇచ్చాడు. ఈరోజు సాయంత్రం లోపు దాదాపు ఫస్ట్ లుక్ బయటకి వచ్చే అవకాశం ఉందని భావించిన వాళ్లందరికీ ట్రిపుల్ ఆర్ నుంచి వచ్చి ట్వీట్ ఆశ్చర్యపరిచింది. మరి ఈ రోజు కూడా అప్డేట్ ఇవ్వని రాజమౌళి, దీపావళికో లేక న్యూ ఇయర్ కైనా ఆర్ ఆర్ ఆర్ అప్డేట్ ఇస్తాడా అనేది చూడాలి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎప్పటిలాగే కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత చాలా సినిమాలు ఆ రికార్డులని టచ్ చేయడానికి ట్రై చేశాయి కానీ అవేమి బాహుబలి రికార్డులని టచ్ కూడా చేయలేకపోయాయి. జులై 30 2020న ఆ రికార్డులు తిరగరాయబడతాయేమో చూడాలి.