Srivishnu: రాజ‌మౌళి లాంచ్ చేసిన గాలిసంప‌త్ ట్రైల‌ర్..

Srivishnu: శ్రీ‌విష్ణు, న‌ట‌కిరీటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో గాలిసంప‌త్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ఎస్‌.క్రిష్ణ‌, షైన్ స్ర్రీన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ల‌వ్లీ సింగ్ న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతాగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేర‌కు ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి చేతుల మీదుగా గాలి సంప‌త్ ట్రైల‌ర్ రిలీజ్ అయింది.

పిల్లలు త‌ప్పు చేస్తే త‌ల్లిదండ్రులు చాలా ఓపిగ్గా ప్రేమ‌గా క‌రెక్ట్ చేస్తారు.. హా అదేంటో కాస్త మీసాలు వ‌చ్చేస‌రికి పెద్దొళ్లు ఏం చేసినా ఊరికే చిరాకులు వ‌చ్చేస్తాయి.. కోపాలు వ‌చ్చేస్తాయి.. నేను కూడా మా నాన్న కాస్త ఓపిగ్గా ప్రేమ‌గా అడ‌గాల్సింది అంటూ సాగే ట్రైల‌ర్ ఎంతో అల‌రిస్తోంది. ప్ర‌తి అమ్మాయికీ డ‌బ్బున్నోడు కావాలి.. లేక‌పోతే ఫారిన్ వాడు కావాలి. డ‌బ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డ‌బ్బే ఇస్తాడు. టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తాడు అంటూ Srivishnuశ్రీ‌విష్ణు చెప్పె డైలాగ్ ఎంతో అల‌రిస్తోంది. దీంట్లో రాజేంద్ర‌ప్ర‌సాద్ శ్రీ‌విష్ణుకు తండ్రిగా న‌టిస్తున్నాడు.. ఇక ఈ చిత్రం మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.