Utterkhand: ఒకే ఒక్క‌డు గుర్తుంది క‌దా.. ఆ త‌ర‌హాలో ఒక్క‌రోజు ముఖ్య‌మంత్రిగా విద్యార్థిని!

Utterkhand: ప్ర‌ముఖ త‌మిళ్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన సెన్సెష‌న‌ల్ మూవీ ఒకే ఒక్క‌డు గుర్తుంది క‌దా.. ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన యాక్ష‌న్ కింగ్ అర్జున్‌కు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా భారీ విజ‌యవంత‌మ‌వ‌డానికి కార‌ణం… ఒక సామాన్య మ‌నిషి ఒక్క‌రోజు ముఖ్య‌మంత్రి ప‌దవి చేప‌డితే రాష్ట్రాన్ని ఎలా చేయ‌గ‌ల‌డు?.. ఎలా చేస్తే త‌న రాష్ట్రం బాగుంటుంది?.. రాష్ట్రంలో రోడ్డు స‌మ‌స్య‌లు, నిరుపేద‌ల స‌మ‌స్య‌లు, నిరుద్యోగ స‌మ‌స్య‌లు ఇలా ప‌లు స‌మ‌స్య‌లు తలెత్తితే ఆ ఒక్క‌రోజులో చేసి చూపించి.. సినీ ప్రేక్ష‌కులనే కాకుండా.. ప‌లు రాజ‌కీయ పార్టీల తీరును మార్చేసేలా చేసిన చిత్రం ఒకే ఒక్క‌డు. ఈ పాత్ర‌లో అర్జున్ న‌టించి ఓ రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకున్నారు.

Utterkhand: ఇదిలా ఉంచితే అస‌లు విష‌యానికొద్దాం.. ఒకే ఒక్క‌డు చిత్రంలో ఒక్క‌రోజు ముఖ్య‌మంత్రి ఉన్న‌ట్టు నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటుంది మ‌రీ.. తాజాగా ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రిగా పందొమ్మిదేళ్ల సృష్టి గోస్వామి జ‌న‌వ‌రి 24న వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఆ రోజు జాతీయ బాలికా దినోత్స‌వాల సంద‌ర్భంగా ఆమెకు ఈ అవ‌కాశం ల‌భించింది. హ‌రిద్వార్ చెందిన ఆమె రాష్ట్రంలోని గైర్ సెయిన్ నుంచి కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తారు. ఈ నేప‌థ్యంలో ఆమె ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను స‌మీక్షిస్తారు. ఈ విష‌యంపై బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ఉషా నేగి మాట్లాడుతూ.. జాతీయ బాలికా దినోత్సం సంద‌ర్భంగా Utterkhand ఒక్క‌రోజు ముఖ్య‌మంత్రిగా చేప‌ట్టే అవ‌కాశాన్ని సృష్టి గోస్వామి క‌ల్పించిన‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి లేఖ రాయ‌గా.. దీంతో గైర్‌సెయిన్‌లోని శాస‌న‌స‌భ‌లో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. అలాగే సృష్టి గోస్వామి మాట్లాడుతూ.. తాను బీఎస్‌సి మూడ‌వ సంవ‌త్స‌రం చ‌దువుతున్నానని, Utterkhand ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి ఒక్క‌రోజు ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం రావ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంది. తాను ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నానని, ప్ర‌జా సంక్షేమం కోసం కృషి చేస్తూ.. ప‌రిపాల‌న‌లో ఉన్న‌త స్థానాల‌కు యువ‌త ఎద‌గ‌గ‌ల‌ర‌ని రుజువు చేయ‌డానికి కృషి చేస్తాన‌ని సృష్టి గోస్వామి పేర్కొంది. ఇది ఒక్క‌రోజు ముఖ్య‌మంత్రిగా చేప‌ట్ట‌బోయే విద్యార్థి సృష్టి గోస్వామి నిజాయితీ మాట‌లు.