ఐటెంసాంగ్‌తో ఫ్యాన్స్‌లో జోష్ పెంచిన బెల్లంకొండ శ్రీనివాస్‌!‌

యంగ్ డైన‌మిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం అల్లుడు అదుర్స్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న‌ విడుద‌ల కాబోతుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా చిత్ర‌టీమ్ ప్ర‌మోష‌న్స్ దూకుడుగా చేస్తున్నారు. ఇప్ప‌టికే టీజ‌ర్.. ట్రైల‌ర్.. లిరిక‌ల్ సాంగ్స్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు సినీ ప్రేక్ష‌కుల్లో నెల‌కొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఐట‌మ్‌సాంగ్ రిలీజ్ చేశారు.

రంభ ఊర్వ‌శి మేన‌కా అంటూ శ్రీ‌నివాస్‌, బిగ్‌బాస్‌-4 ఫేం మోనాల్‌గ‌జ్జ‌ర్ ఈ సాంగ్ లిరిక‌ల్ వీడియోలో క‌నిపిస్తూ.. ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తున్నారు. ఈ సాంగ్‌ను శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేయ‌గా, ఈ పాట‌కు థియేట‌ర్స్‌లో మాత్రం ఫ్యాన్స్ ఈలలతో బాక్స్‌ బ‌ద్ధ‌లవ్వాల్సిందే. అలాగే ఈ పాట‌లో సిల్క్‌స్మిత నుండి నిన్న మొన్న‌టి స‌న్నీలియోన్ వ‌ర‌కు అంద‌రిని వాడేసాడు గీత‌ర‌చ‌యిత శ్రీ‌మ‌ణి. ఈ సినిమాకు దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చ‌గా.. ఈ ఐటెం సాంగ్‌ను మంగ్లీ, హేమ‌చంద్ర‌లు పాడ‌గా మ‌రింత జోష్ పెంచింది. ప్ర‌స్తుతం ఈ ఐటెం సాంగ్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. బెల్లంకొండ శ్రీ‌నివాస్ స‌ర‌స‌న న‌భా న‌టేష్‌, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అదేవిధంగా ఈ చిత్రంలో ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో సోనూసూద్ పోషిస్తున్నాడు.