లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సినీ గేయ రచయిత

సినీ గేయ రచయిత శ్రీమణి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తాను ప్రేమించిన ఫరా అనే అమ్మాయిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. ‘నా స్వీట్ లిటిల్ ఏంజెల్ ఫరాకు నా జీవితంలోకి స్వాగతం చెబుతున్నాను. ఈ క్షణం కోసం మేమిద్దం గత 10 ఏళ్లుగా వేచి చూస్తున్నాం. మొత్తానికి మా కల నిజమైంది. మా మనసులను అర్థం చేసుకున్న ఆ దేవుడికి, మా తల్లిదండ్రులకు ధన్యవాదాలు’ అని శ్రీమణి ట్వీట్‌లో పేర్కొన్నాడు.

SRIMANI

దీనికి గాను అతడికి సినీ సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌కు శ్రీమణి ఎక్కువ పాటలు రాశారు. దీంతో ‘మీ రొమాంటిక్ లిరిక్స్ వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ‘ఇష్క్ సిఫాయా’ అని పాడి.. ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్ చేసి.. ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లిచేసుకున్నారన్న మాట’ అని దేశీ శ్రీ ప్రసాద్ అతడికి విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు.

టాలీవుడ్‌లో స్టార్ హీరోల అందరితో కలిసి శ్రీమణి కలిసి పనిచేశారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీమణి.. జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అజ్ఞాతవాసి’ లాంటి చాలా పెద్ద సినిమాలకు పాటలు రాశాడు.