Srikanth Addala: ‘నారప్ప’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎవరితో తెలుసా?

Srikanth Addala: టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం వెంకటేష్‌తో నారప్ప అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియమణి ప్రముఖ పాత్రలో నటిస్తుండగా.. సమ్మర్ కానుకగా దీనిని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇది విడుదల కాకముందే శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించబోయే మరో సినిమా ఫిక్స్ అయింది.

srikanth addala next movie

ప్రముఖ నిర్మాత, ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాల కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల తన తర్వాతి సినిమా తీయనున్నాడు. ఈ సినిమాకు కూచిపూడి వారి వీధిలో అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించనున్నారు. గోదావరి ప్రాంతం నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశముంది.