శ‌రణ్ కుమార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గ్లింప్స్ రిలీజ చేసిన శ్రీ వెన్నెల క్రియేష‌న్స్!!

సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న సంగ‌తి తెలిసిందే. శివ కేశ‌ర కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ఎం.సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం శ‌ర‌ణ్ కుమార్ పుట్టిన‌రోజు ఈ సంర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఆవిరి ప‌ట్టిన అద్దాన్ని తుడిస్తే అందులో హీరో శ‌ర‌ణ్ కుమార్ ముఖం క‌నిపిస్తుంది. గ్లింప్స్ చాలా డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. ఇప్ప‌టికే సూప‌ర్‌స్టార్ కృష్ణ హీరో లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయగా దానికి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.


నిర్మాత ఎం.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘హీరో శరణ్‌కుమార్‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌డం హ్య‌పీగా ఉంది. సూప‌ర్‌స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శ‌ర‌ణ్‌కు ఈ సినిమా క‌చ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుంది. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

న‌టీన‌టులు:

శ‌ర‌ణ్ కుమార్‌

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: శ్రీ వెన్నెల క్రియేష‌న్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: బేబీ ల‌లిత‌
నిర్మాత‌: ఎం.సుధాక‌ర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: శివ కేశ‌ర కుర్తి
సినిమాటోగ్ర‌ఫీ: చైత‌న్య కందుల‌
మ్యూజిక్‌: భీమ్స్ సిసిరోలియో
ఆర్ట్‌: కె.వి.ర‌మ‌ణ‌
ఎడిట‌ర్‌: సెల్వ కుమార్