ఘనంగా శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకలు

విశ్వ విఖ్యాత, నటసార్వభౌమ, దర్శకుడు, నిర్మాత, ఎక్సిబిటర్, స్టూడియో అధిపతి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గత గౌరవ ముఖ్యమంత్రి కీర్తి శేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 99వ జన్మదినం (28-05-2022) పురస్కరించుకొని, అప్పటినుండి 100వ జన్మదినం (28-05-2023) వరకు శతజయంతి వేడుకలు  తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి  మరియు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తో కలిసి ఘనంగా జరపాలని కౌన్సిలు ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది.

ఈ వేడుకలు  జయప్రదం చేయడానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, ఎంప్లాయిస్ ఫెడరేషన్, నటీనటుల సంఘం, తెలుగు సినిమా దర్శకుల సంఘం, తెలుగు సినిమా రైటర్స్ సంఘం సహకారం కోరడం జరిగింది. ముఖ్యంగా, ఈ విషయమై, ప్రముఖ హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి సలహాలు సహకారం కోరడం జరిగింది.