భీమ్ లా నాయక్ వచ్చేస్తున్నాడు, సోషల్ మీడియాలో సునామి…

సోషల్ మీడియాలో సునామి సృష్టించడానికి, యుట్యూబ్ రికార్డ్స్ తిరగారయడానికి, కొత్త రికార్డుల చరిత్ర రాయడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచేస్తున్నాడు. అది కూడా పోలిస్ యునిఫార్మ్ లో వస్తున్నాడు, భీమ్ లా నాయక్ గా వస్తున్నాడు. మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుం సినిమా షూటింగ్ మొదలయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కి కాస్త గ్యాప్ ఇచ్చి, దాని ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. స్పెషల్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పవర్ స్టార్ బ్యాక్ టు షూట్ అంటూ బయటకి వచ్చిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించడానికి ఫ్యాన్స్ అంతా ఈవెనింగ్ 4:05 గంటల కోసం వెయిట్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ రీమేక్ ని సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండగా త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పోలిస్ యునిఫామ్ లో గబ్బర్ సింగ్ ని గుర్తు చేసేలా ఉన్నాడు. మొత్తానికి సాయంత్రం సోషల్ మీడియాలో సునామి అంటే ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్…