ప్రముఖ గాయకుడు, బాలసుబ్రమణ్యం కొన్ని వారాల క్రితం కరోనా వైరస్ భారిన పడిన విషయం తెలిసిందే. కోవిడ్ 19 పాజిటివ్ అని తెలియగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు బాలు గారు త్వరగా కొలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇక ఇటీవల SPB ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని సమాచారం అందిన విషయం తెగేలిసిందే. ఇక ప్రస్తుతం బాలు గారు ఇంకా ఐసియులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై దృష్టి పెడుతూ చికిత్స అందిస్తున్నారు. ఇక సోమవారం ఈ సీనియర్ గాయకుడి ఆరోగ్య పరిస్థితి కొంత అదుపులోకి వచ్చి కోలుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులు కూడా ఆయనకు ఇతర సమస్యలు పెద్దగా లేవని కేవలం వైరస్ ఎక్కువ ఎఫెక్ట్ చూపినట్లు చెబుతున్నారు. అదే విధంగా బాలుగారు సురక్షితంగా ఉంచేందుకు తాము తీవ్రంగా కృషిచేస్తామని కూడా అన్నారు. బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని మళ్ళీ పాటలతో ఆయన అభిమానులను అలరించాలని మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, మహేష్ బాబు వంటి స్టార్స్ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.