
తెలుగు, తమిళ, కన్నడ, మలయా చిత్రాలలో నటించిన షావుకారి జానకి అంటే తెలియని సినిమా ప్రేమికులు ఉండరు. 1931లో రాజమండ్రిలో జన్మించిన ఆమె తన 14వ ఏటా ఆకాశవాణి మద్రాస్ లో ఆర్టిస్ట్ గా మొదలయ్యారు. ఆ తరువాత షావుకారు చిత్రం ద్వారా ఆమె సినీ ఆరంగేట్రం చేసారు. అయితే రెండు మూడు తరాలు ఒకటే కనిపించడం కష్టం అవుతున్న ఈ రోజుల్లో ఆమె తన 5 తరాలతో దిగిన ఒక ఫోటో ప్రజలను ఆకర్షిస్తుంది. షావుకారి జానకి కూతురు యజ్ఞప్రభ, యజ్ఞప్రభ కూతురు వైష్ణవి, వైష్ణవి కూతురు అదితి, అదితి కూతురు మేఘన ఒకటే కనిపిస్తున్నారు. 93 సంవత్సరాల జానకి గారు ఇటీవలే కాలంలో కూడా సినిమాలలో నటించడం గమనార్హం.