తమిళ్, మళయాళం, తెలుగు చిత్రపరిశ్రమలో సపోర్టింగ్ రోల్స్ తో ఎంతగానో మెప్పించిన ప్రముఖ నటి శరణ్య ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి ఎబి రాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఒక్కసారిగా సినీ పరిశ్రమలో ఈ విషయం అందరిని షాక్ కి గురి చేసింది. ఆయన మలయాళం, తమిళ్ లో పలు సినిమాలకి దర్శకత్వం వహించారు.
దాదాపు 60 కి పైగా మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు ఎబి రాజ్ (95) నిన్న రాత్రి 8 గంటలకు చెన్నైలోని విరుగంబాక్కం లోని తన కుమార్తె శరణ్య నివాసంలో మరణించారు. చివరి కర్మలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడతాయని సమాచారం. రాజ్ 1951 నుండి 1986 వరకు చిత్ర పరిశ్రమలో చురుకుగా ఉన్నారు. తమిళం, మలయాళం మరియు సింహళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎబి రాజ్ శరణ్యతో పాటు మరో ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.