Khammam: పుట్టిన బిడ్డ‌కు సోనూసూద్ పేరు.. అన్న‌ప్ర‌స‌న్న వేడుక‌కు రానున్న రియ‌ల్ హీరో..

Khammam: సోనూసూద్‌.. క‌రోనా సంక్షోభంలో ఎంతో మందికి దేవుడిలా సాయం అందించి దేశవ్యాప్తంగా రియ‌ల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే సోష‌ల్ మీడియాలో ఎంత‌మంది సాయం కోరితే వెంట‌నే వాటిపై స్పందించి ప‌రిష్క‌రించేవాడు సోనూసూద్‌. దీంతో సోనూసూద్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఎంతోమంది ఆయ‌న‌కు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. తెలంగాణ‌లో అయితే ఏకంగా ఆయ‌న‌కు గుడి క‌ట్టారు.

sonusood

సిద్ధిపేట జిల్లాలోని ఓ తండా ప్ర‌జ‌లు సోనూసూద్‌కు గుడి క‌ట్టించి పూజ‌లు చేస్తున్నారు. ఇలా ఆయ‌న పేరు మీద షాప్స్ ఓపెన్ చేయ‌డం, షాప్స్ పెట్ట‌డం వంటి ప‌లు రకాలుగా సోనూకు ఇలా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నారు. Khammam ఇక తాజాగా ఖ‌మ్మం జిల్లాలోని బోన‌క‌ల్ మండ‌లంలో ముష్టిగుంట్ల గ్రామానికి చెందిన పండ‌గ న‌వీన్‌- త్రివేణి దంపతుల‌కు ఇటీవ‌లే పుత్రుడు పుట్టాడు. ఈ నేప‌థ్యంలోనే ఆ బాబు అన్న‌ప్ర‌స‌న్న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలోనే బంధుమిత్రుల‌ను ఆహ్వానించేందుకు ఆహ్వాన ప‌త్రిక‌ల‌ను రూపొందించారు. ఇందులో భాగంగా ఆ బాబుకు సోనూసూద్ అని పేరు పెట్టారు. ప్ర‌స్తు‌తం Khammam ఆ ఆహ్వాన ప‌త్రిక నెట్టింట్లో తెగ వైర‌ల్‌గా మారింది. అయితే ఈ నేప‌థ్యంలోనే ఆ ఆహ్వాన‌ప‌త్రిక‌ను సోనూసూద్‌కు పంపించారు. దీంతో ఈ వేడుకకు హాజరు కావడానికి.. ఆ పసికందును ఆశీర్వదించడానికి సోనుసూద్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న సోనుసూద్ Khammam ఖమ్మంకు బయలుదేరవచ్చని స‌మాచారం.