వెండితెరపై విలన్ గా మంచి క్రేజ్ అందుకున్న సోనూ సూద్ లాక్ డౌన్ తరువాత ఒక రియల్ హీరోగా అవతరించిన విషయం తెలిసిందే. వీలైనంత వరకు తన సహాయాన్ని ప్రజలకు చేరేవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఫైనల్ గా తన బయోపిక్ కి సంబంధించిన విషయం గురించి సోనూ సూద్ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చాడు.
సోనూ సూద్ మాట్లాడుతూ.. నిజానికి నా బయోపిక్ తెరకెక్కించాలని చాలా మంది అడిగారు. అది నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తుంది అంటే మంచి విషయమే.. కానీ ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది. ఎన్నో సినిమాలు చేయాలి. అలాగే ప్రజలకు కూడా ఇంకా సహాయం చేయాలి. అందుకే బయోపిక్ కి ఇంకా సమయం ఉందని అనుకుంటున్నా. ఇక నా బయోపిక్ చేయాలి అంటే ఒక కండిషన్. ఆ బయోపిక్ లో నేనే నటించాలి. అందుకు నేను అర్హత సంపాదించాను అనుకుంటున్నాను.. అని సోనూ సూద్ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు. ఇక రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదని చెప్పిన సోనూ సూద్ మరో పదేళ్ల వరకు ఇలానే సినిమాలు చేసుకుంటూ మంచి పనులు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.