పాపం ఈ భామ.. సినిమా ఛాన్స్‌ల కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది

హీరోలు, హీరోయిన్లు అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం కామనే. శృతిహాసన్, అల్లు అర్జున్, రాంచరణ్.. ఇలా చాలామంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నవారే. ప్రస్తుతం ఒక హీరోయిన్ కూడా సినిమా అవకాశాల కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని పూర్తిగా గుర్తుపట్టని విధంగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరో కాదు.. సోనియా అగర్వాల్.

SONIA AGARWAL

7/జీ బృందావన కాలనీతో విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించింది. దర్శకుడు సెల్వరాఘవన్‌ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది.

ఇప్పుడు ఛాన్స్‌ల కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత దిగిన ఫొటోలను సోనియా అగర్వాల్ తాజాగా తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమెను చూసి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. మరి ఇప్పుడైనా ఆమెకు అవకాశాలు వస్తాయా? లేదా? అనేది చూడాలి