‘పాపం పసివాడు’ ఒరిజినల్ వెబ్ సిరీస్ నుంచి పాట రిలీజ్ ..

సెప్టెంబర్ 20, హైదరాబాద్: ఆహ ‘పాపం పసివాడు’ ఒరిజినల్‌లోని పాటను రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 29న ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ది వీకెండ్ షో నిర్మాణంలో ఈ సీరిస్ రూపొందింది. ఇందులో 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రేమలో చిక్కుకున్న ఓ యువకుడి జీవితంలో ఎలాంటి గందరగోళం క్రియేట్ అయ్యిందనే విషయాన్ని అందరూ ఎంజాయ్ చేసేలా చక్కగా తెరకెక్కించారు.

పాపం పసివాడు సిరీస్ విషయానికి వస్తే ఇందులో పాతికేళ్ల కుర్రాడైన మన కథానాయకుడు క్రాంతి ప్రేమ కోసం హృదయమంతా బాధతో పరితపిస్తూ ఎదురు చూస్తుంటాడు. అయితే ఉన్నట్లుండి ఒకరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు అమ్మాయిలు అతని జీవితంలోకి ప్రవేశిస్తారు. దాంతో అతని జీవితంలో ఊహించిన ఘటనలు జరుగుతాయి. లైఫ్ అనేక మలుపులు తిరుగుతుంది. ఈ రొమాంటిక్ జర్నీలోకి విషయాల చుట్టూ కథ నడుస్తున్నప్పుడు తెలియని గందరగోళం క్రియేట్ అవుతుంది. దాన్ని ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారు.

ఈ సిరీస్‌కు అనుబంధంగా ఆహా ..‘పాపం పసివాడు’ అనే పాటను విడుదల చేసింది. సిరీస్‌లోని పాత్రలను తరచి చూస్తూనే భావోద్వేగ ప్రయాణాన్ని ఈ పాటలో ఆవిష్కిరంచారు.

మ్యూజిక్ డైరెక్టర్ : జోస్ జిమ్మీ
ర్యాప్ సాంగ్ రాసి పాడినవారు: ఆదిత్య రావ్ గంగసాని
ఓకల్స్: కార్తీక వైద్యనాథన్
ఆడిషనల్ ఓకల్స్ (డైలాగ్స్): ఐశ్వర్య దరూరి
మిక్స్ అండ్ మాస్టర్డ్: కిషన్ శ్రీబల్

  • సెప్టెంబర్ 29 నుంచి ‘పాపం పసివాడు’ ఒరిజిల్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది. మిస్ కాకండి.. కచ్చితంగా ఈ ప్రేమకథాంశం ప్రేక్షకులకు కావాల్సినంత భావోద్వేగాలను, నవ్వులను తప్పకుండా అందిస్తుంది.*