సుడిగాలి సుధీర్ G.O.A.T (గోట్) చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్

ప్రముఖ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి
చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా ఈచిత్రం నుంచి అయ్యో పాపం సారూ.. అనే ఓ బ్యూటిఫుల్ లిరిక‌ల్ వీడియోను శ‌నివారం విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. సురేష్ బ‌నిశెట్టి సాహిత్యం స‌మ‌కూర్చిన ఈ పాట‌కు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. హీరో సుధీర్‌, హీరోయిన్ దివ్య‌భార‌తిల‌పై చిత్రీక‌రించిన ఈ పాట విన‌సొంపైన బాణీల‌తో, క్యాచీ ప‌దాల‌తో అంద‌ర్ని ఆక‌ట్టుకునే విధంగా వుంది. నిర్మాత మాట్లాడుతూ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఏక‌ధాటిగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. హీరో సుధీర్, హీరోయిన్ దివ్యభారతిలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఏపిసోడ్స్ కూడా చిత్రీకరిస్తున్నాం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది అన్నారు.


సంగీతం: లియోన్ జేమ్స్

డీఓపీ: ర‌సూల్ ఎల్లోర్‌
ఎడిటర్: కె.విజయవర్ధన్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ : రాజీవ్ నాయర్

రచయిత: ఫణికృష్ణ సిరికి

కో ప్రొడ్యూస‌ర్‌: ర‌వీంద్ర రెడ్డి.ఎన్‌

క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: ప్ర‌సూన మండ‌వ‌

పీఆర్ ఓ: ఏలూరు శ్రీ‌ను, మ‌డూరి మ‌ధు