బిగ్‌బాస్‌లోకి బీజేపీ నాయకురాలు

బిగ్‌బాస్ షో అన్ని భాషల్లో బాగా పాపులర్ అయిన షో. ఈ షోకు ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో పాల్గొని పాపులర్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పాపులర్ షోలో పాల్గొనే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. ఇప్పుడు నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్ హిందీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ఎంట్రీ బిగ్‌బాస్ షోకు బాగా ఉపయోపడుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.

sonali phogat

తాను బిగ్‌బాస్‌కి చాలా పెద్ద అభిమానిని అని, ఇంత పెద్ద షోలో పాల్గొనే అవకాశం దక్కడం అదృష్టమని హౌస్‌లోకి అడుగుపెట్టే సమయంలో సోనాలి ఫోగాట్ చెప్పింది. జీవితకాలంలో ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని తాను ఎలా తిరస్కరించగలనని చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ సీజన్‌కి సంబంధించిన దాదాపు అన్ని ఎపిసోడ్లు తాను చూశానని, ఇప్పుడు లోపలికి వెళ్తుంటే ఇది నిజమా?.. కలా? అన్నట్లు అనిపిస్తుందని తెలిపింది.

లోపలికి అడుగుపెట్టాలని చాలా ఉత్సాహంతో ఉన్నానని, ప్రయాణం ఎలా ఉంటుందో తనకు తెలియదని చెప్పింది. కానీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తానని ప్రామిస్ చేస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం సోనాలి ఫోగట్ బీజేపీ మహిళా మెర్బా విభాగానికి నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉంది. పంజాబీ మ్యూజిక్ వీడియోలతో పేరు సంపాదించుకున్న ఆమె.. ఆ తర్వాత పలు టీవీ షోలలో కూడా పాల్గొంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరింది.