Bollywood: ఖాకీ డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి హ‌ల్‌చ‌ల్‌..

Bollywood: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. స‌ల్మాన్ హీరోగా తెర‌కెక్కిన ద‌బాంగ్ మూవీతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. దీంతో సోనాక్షికీ Bollywood బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే కాకుండా ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. దీంతో వ‌రుస‌గా అవ‌కాశాలు త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిప‌డుతున్నాయి. కానీ కొన్నెళ్లుగా స‌క్సెస్‌లేక సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అందాల ఆర‌బోత‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

sonakshi

అలాగే మ‌రోవైపు వీడియో ఆల్బ‌మ్‌లో కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను చేసిన సోనాక్షి తాజాగా ఖాకీ డ్రెస్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అమెజాన్ ప్రైమ్ డిజిట‌ల్ వేదిక‌పై లేడీ షాట్ గ‌న్ వెబ్ సిరీస్‌లో సోనాక్షి న‌టిస్తుంది. ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. అయితే నేడు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా సోనాక్షి ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. స్త్రీ త‌లుచుకుంటే ఏదైనా సాధిస్తుంది అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇక సోనాక్షి న‌టిస్తున్న తొలి Bollywood వెబ్‌సిరీస్‌ను రీమా కాగ్టీ, రుచికా ఒబెరాయ్ ద‌ర్శ‌క‌త్వంలో.. రితేశ్ సిద్వానీ, ఫ‌ర్హాన్ అఖ్త‌ర్‌, కాగ్టీ, జోయా అఖ్త‌ర్ వెబ్‌సిరీస్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.