Priyanka nick: అమెరికాలో రెస్టారెంట్ ప్రారంభించిన గ్లోబ‌ల్ స్టార్ బ్యూటీ..

Priyanka nick: ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.. హాలీవుడ్ పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత‌‌ అమెరికాలో పూర్తిగా సెటిల్ అయింది.. అక్క‌డ‌నే సినిమాలు, ప‌లు టీవీ ప్రొగ్రాంలు చేస్తూ బిజీగా గడేపేస్తోంది. కాగా తాజాగా ప్రియాంక చోప్రా రెస్టారెంట్ అమెరికాలో ప్రారంభించింది.. న్యూయార్క్‌లో సోనా పేరుతో రెస్టారెంట్ ప్రారంభించింది..

ఈ సంద‌ర్భంగా ప్రియాంక తెలుపుతూ.. ఆ రెస్టారెంట్‌కు పేరు పెట్టింది త‌న భ‌ర్త నిక్ జోనాస్ అని ఆమె అన్నారు. ఈ రెస్టారెంట్‌లో నోరూరించే ఇండియ‌న్ వంట‌కాల‌ను వ‌డ్డ‌న చేయ‌నున్నార‌ని.. అయితే తాను లండ‌న్‌లో ఉండ‌డంతో త‌న రెస్టారెంట్ ప్రారంభ‌త్స‌వంలో పాల్గొన‌లేక‌పోయాన‌ని తెలిపింది.. ప్ర‌స్తుతం రెస్టారెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.