
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన తాజా సందేశంలో దేశభక్తి, సైనికుల పట్ల అచంచలమైన మద్దతును వ్యక్తం చేశారు. “భారత్ మాతా కీ జై” అనే నినాదంతో తమ #సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని భారత సైనికుల సంక్షేమం కోసం విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, “మా సపోర్ట్ ఎప్పుడూ మన సైనికులకే. దేశం కోసం అహర్నిశలు కష్టపడే వారి త్యాగాలకు మా వంతు కృషిగా, ఒక సినిమా లాభాల్లో కొంత భాగాన్ని సైనికుల సంక్షేమం కోసం అందిస్తాము” అని తెలిపారు.