“SBSB” ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా శుక్రవారం విడదలై మంచి రెస్పాన్స్‌ను సంపాదించుకుంది. లాక్‌డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైన టాలీవుడ్ పెద్ద హీరో సినిమా ఇదే కావడంతో.. దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కరోనా ప్రభావం క్రమంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా?.. లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. కానీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల సందడి బాగానే కనిపించింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవు కావడంతో.. చాలామంది థియేటర్లకు వచ్చి ఫ్యామిలీతో కలిసి సినిమా చూశారు.

solo brathuke so better movie

తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 400 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మధ్యలో సీటు వదిలేసి 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడుపుతున్నారు. దీంతో తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు సంపాదించినట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇవేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. కరోనా లేకపోతే దాదాపు రూ.10 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. సినిమాలో కామెడీ బాగుండటం, ఎమోషనల్ సీన్లు ఆకట్టుకోవడంతో సినిమాకు మంచి టాక్ వచ్చింది.

దీంతో శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఇలాంటి కరోనా సమయంలో ఇంత మంచి కలెక్షన్లు సంపాదించడం గ్రేట్ అని చెబుతున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మిగతా నిర్మాతలు కూడా తమ సినిమాలను కూడా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.