‘అందరినీ ఒకతాటిపైకి తెచ్చేఅంశం మట్టి’ – సద్గురు !!

శుక్రవారం దుబాయ్‌‌లో జరిగిన COP28 ప్రారంభ సెషన్‌లకు మట్టిని రక్షించు ఉద్యమ వ్యవస్థాపకులు సద్గురు హాజరయ్యారు.

UK ప్రధాని – రిషి సునక్, భారత ప్రధాని – నరేంద్ర మోదీ, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు – అజయ్ బంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు – ఇమ్మాన్యుయేల్ మాక్రాన్,ఇండోనేషియా అధ్యక్షుడు – జోకో విడోడో, UAE యొక్క వాతావరణ మార్పు మరియు పర్యావరణ మంత్రి హెచ్‌ఈ మరియం అల్మ్‌హీరి, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌‌లతో సహా పలువురు ప్రపంచ నాయకులు హాజరయ్యారు.

“మీరు ఎవరు,  మీ విశ్వాసం ఏంటి, లేదా మీరు ఏ స్వర్గానికి వెళ్ళబోతున్నారు అన్నవి వేరు కావొచ్చు, కానీ మనమందరం ఒకే మట్టి నుండి వచ్చాము, అదే మట్టి నుంచి తింటున్నాము, అలాగే చనిపోయినప్పుడు తిరిగి అదే మట్టిలోకి వెళ్తాము. అందరినీ ఒక తాటిపైకి తెచ్చే అంశం – మట్టి! విశ్వాస నాయకులు – మట్టి పునరుజ్జీవన విధానాలు అమలు అయ్యేలా – ప్రజలను మరియు విధాన రూపకర్తలను ప్రభావితం చేయడంలో, ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించగలరు” అని COP28 ఫెయిత్ పెవిలియన్‌లో, సద్గురు తన ప్రారంభ ప్రసంగంలో అన్నారు.