న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెబుతూ ఎవరు పద్దతుల్లో వారు ఎంజాయ్ చేస్తారు. కరోనా వల్ల ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిరాడంబరంగా జరిగాయి. ఇంతకుముందు లాగా ఎక్కడా పెద్దగా సందడి కనిపించలేదు. అందరూ ఇంట్లోనే హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రెట్ చేసుకున్నారు. న్యూ ఇయర్ వచ్చిందంటే.. ప్రతిఒక్కరూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ విషెస్ చెబుతూ ఉంటారు.
కానీ బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ మాత్రం వినూత్నంగా విషెస్ చెప్పింది. తన న్యూడ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పింది. అసలు బట్టలు లేకుండా ఫొటోలను షేర్ చేసింది. ‘మీరు ఒంటిరిగా ఉన్నప్పుడు మీలోని ఆత్మ శక్తి, శరీర శక్తి పెరుగుతుంది. అది మీలోని చీకట్లను దూరం చేస్తుంది. బాధ్యత తీసుకోవడమే మీలో నిజాన్ని తెలియజేస్తుంది. సత్యాలు బయటపడతాయి. అబద్దాలు బహిర్గతమవుతాయి’ అంటూ ఫోటోతో పాటు మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.
సోఫియా హయత్ ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉంటుంది. గతంలో సన్యాసం తీసుకున్న ఆమె.. ఆ తర్వాత దానిని వదిలేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్, వీడియోలు పోస్ట్ చేస్తూ రెచ్చిపోతోంది.