ట్యాలెంట్ ఉన్న నటులు ఎక్కడైనా నిరూపించుకుంటారు అని ప్రూవ్ చేస్తున్న సోషల్ వర్కర్, యాక్టర్ ”కోటి”!!

నటుడు, సంఘ సేవకుడు కోటి పలు చిత్రాల్లో నటించారు, కేఏ.పాల్ కు సన్నిహితంగా ఉండే నటుడు కోటి. ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులతో మంచి పరిచయాలు ఉన్నాయి అలాగే రామ్ గోపాల్ వర్మ మరియు పవన్ కళ్యాణ్, జేడీ.చక్రవర్తికు అత్యంత సన్నిహితుడు, ఈ కరోన సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు కోటి.

పవన్ కళ్యాణ్, కత్తి మహేష్ వివాదాన్ని కోటి పరిష్కరించారు, పూనమ్ కౌర్, ఇలా ఇలాంటి టాపిక్స్ వచ్చినా మొదట వినపడే పేరు కోటి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అలాగే అందరూ దర్శక నిర్మాతలతో కోటికి మంచి పరిచయాలు ఉన్నాయి.

అనేక సినిమాలలో వెండితెర పై నటించిన కోటి యాదవ్ మొదటిసారిగా బుల్లితెరపై స్టార్ లైన్ ప్రొడక్షన్స్ రామ్ జీ గారి దర్శకత్వం లో సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే జీ తెలుగు రాధమ్మ కూతురు సూపర్ హిట్ సీరియల్ లో గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ నెగిటివ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసి విలక్షణమైన నటనతో ప్రేక్షకుల ద్వారా మంచిపేరు సంపాదించుకుంటున్న కోటి యాదవ్ ( సోషల్ వర్కర్ & యాక్టర్ )… ఇలాంటి పాత్రలు ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుందాము…
ట్యాలెంట్ ఉన్న నటులు ఎక్కడైనా నిరూపించుకుంటారు అలాగే నటుడు కోటి మరిన్ని మంచి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చెయ్యాలని బిగ్ బాస్ లో కూడా తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనే కోరుకుందాం.