హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదలైన సోషల్ అవెర్నేస్ వీడియో సాంగ్ “స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు క్యాన్సర్”!!

డెంటల్ సర్జన్ గా,సోషల్ యాక్టివిస్ట్ గా ప్రతి సంవత్సరం టొబాకో పై ఆగినెస్ట్ గా వీడియోను విడుదల చేసి టోబాకో వలన జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ సమాజానికి ఆరోగ్యంపట్ల అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు. ఆయన తీసిన “స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు క్యాన్సర్” అను వీడియో పాటను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్లో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో, ప్రొడ్యూసర్ కౌన్సిల్ హనరబుల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టార్ నుండి నయీమ్ గార్లు పాల్గొన్నారు . ఆనంతరం ఈ కార్యక్రమంలో

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ …ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సోషలిస్టుగా, డాక్టర్ గా తన సేవలు సమాజానికి అందిస్తున్నారు ఓగూరు నాగేశ్వరరావు గారు. వారు ఇప్పుడు స్మోకింగ్ మీద “స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు క్యాన్సర్” అను వీడియోను తీయడం జరిగింది. ఇలాంటి మంచి పాటను ఈరోజు నేను విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది. డాక్టర్ వృత్తి లో వుంటూ సమాజానికి ఉపయోగ పడే పాటను తీసిన తనకు నిజంగా నా అభినందనలు.మీరు తీసిన ఈ పాట ఇన్స్పిరేషన్ తో మేము కూడా మాకున్న చిన్నచిన్న అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇటువంటి వీడియోలను చూసి సమాజంలో చాలామంది ఇన్స్పైర్ అయ్యి మారే అవకాశం ఉంది .ఎనీవే నాగేశ్వరావు గారికి ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ హనరబుల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ.. నాగేశ్వరరావు గారు డెంటల్ సర్జన్ గా,సోషల్ యాక్టివిస్ట్ గా ప్రతి సంవత్సరం టొబాకో కి ఎగైనెస్ట్ గా ప్రతి సంవత్సరం మంచి పాటను విడుదల చేస్తారు. లాస్ట్ ఇయర్ లో తెలుగు సాంగ్ ను విడుదల చేయగా ఈ సంవత్సరంలో హిందీ పాటను విడుదల చేశారు. ఈ పాటను పాన్ పరాగ్, ఖైనీ, గుట్కా లను క్యాన్సర్ అని మోటివేట్ తో తీయడం జరిగింది . ఈ పాటను నీటుగా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు.
ప్రస్తుతం ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ వస్తే అది కరోనా మారి లంగ్స్ కు ఎఫెక్ట్ అవుతుంది అంటే డెఫినెట్ గా ఇది పాన్ పరాగులు, సిగిరెట్లు గుట్కా,జర్దాలే ప్రధాన కారణం. కాబట్టి ఇవన్నీ చాలా డేంజరస్ . డెఫినెట్గా ఇలాంటి వీడియో ను చూసి ఎంతో మంది ఇన్స్పిర్ అయ్యి ఇంకా బెటర్ గా మారదానికి దోహదపదుతుంది.. ఒక సోషల్ యాక్టివిస్ట్ గా, డెంటల్ సర్జన్ గా ఉండే ఓగూరు నాగేశ్వరావు గారు చేసిన ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఉపయోగ పడుతుందని బావిస్తున్నాను. మరియు ఈ పాట ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే విధంగా.. ఈ పాట చేసిన నాగేశ్వరరావు గారికి డెఫినెట్ గా అభినందనలు తెలపాల్సిందే. ఇలాంటివి వీడియోను ట్రైలర్ గా , సినిమా హాళ్లలో ప్రేక్షకులకు చూపిస్తే తోబాకో వాడని వారు, వాడేవారు ఏంతో కొంత మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐ.అండ్ బి మినిస్ట్రీ, సెన్సార్ వారు డాక్టర్ నాగేశ్వరావు గారు తీసిన వీడియోలను పరిశీలించి ఈ వీడియోలన్నీ ట్రైలర్స్ గా , థియేటర్స్ లలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి పాటలు తీసిన నాగేశ్వరరావు గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీకాంత్ గారు ఒక మంచి మనిషిగా నేనున్నానని అంటూ ఎప్పుడూ ముందుకు వచ్చే హీరో శ్రీకాంత్ గారిని ఈ కార్యక్రమానికి రమ్మని చాలా తక్కువ టైంలో ఆయనకు చెప్పినా ప్రతి సామాజిక కార్యక్రమంలో గానీ, సోషల్ యాక్టివిటీస్ లో కానీ ఇలాంటి పనులను ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ముందుంటాను. ఏ పరిస్థితుల్లో నైనా నేను నా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మానుకొని సామాజిక బాధ్యతగా, ఒక సామాజిక పౌరుడిగా నేను ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని వచ్చి ఈ పాటని విడుదల చేయడం జరిగింది. వారికీ నా అభినందనలు అని అన్నారు.

డాక్టర్ ఓగూరు నాగేశ్వరావు మాట్లాడుతూ. .. టొబాకో మీద అవేర్నెస్ తీసుకురావాలని ఉద్దేశం తో మేము తీసిన ఈ పాటను హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది .ఈ వీడియో కార్యక్రమానికి శ్రీకాంత్ గారు, ప్రసన్న కుమార్ గారు, నయీమ్ గారు ఇలా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పంచుకోవడం చాలా సంతోషం ఉంది.ముఖ్యంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్మికులందరినీ చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. చాలా మంది పొగాకు, గుట్కా, సిగరెట్, ఖైని అనేకమైన మత్తు పదార్థాలకు అలవాటు పడటం జరుగుతుంది ఇలాంటి అలవాట్లను మానుకుంటే అందరి కుటుంబాలకు మంచిది, మానుకోకపోతే క్యాన్సర్ వంటి మహమ్మారి బలవుతారని మా మంతు వరల్డ్ టొబాకో దినోత్సవం మే 30 తేదీ రోజు న జరుపుకునే ఒక్క రోజు అవేర్నెస్ ప్రోగ్రాం సరిపోదని భావించి మేము నెలరోజులపాటు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపుతున్నాం. కాబట్టి ఇంతకుముందు ప్రతి సెంటర్ కు వెళ్లి టొబాకో నుండి జరిగే నష్టం గురించి చెప్పడం జరిగేది. ఇప్పుడు కరానా ఉన్నందున ఆన్ లైన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా టొబాకో వల్ల ఏమైనా సిమ్టమ్స్ కన్పిస్తే వారు వెంటనే మాకు ఫోన్ చేసినట్టయితే ఆన్ లైన్ లో వారి యొక్క సందేహాలను ఫ్రీగా తీర్చడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా ఈ ఆన్ లైన్
కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మే 1 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి సహకరించడానికి ఫిలించాంబర్ నుంచి వచ్చిన అందరికీ మా నమస్కారాలు తెలియజేస్తున్నామని అన్నారు.