‘జెమిని’తో జత కట్టిన స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్!!

"చెల్లెలు కాపురం, నాపేరు మీనాక్షి, కథలో రాజకుమారి, గోరంత దీపం" వంటి బ్లాక్ బస్టర్ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన "మధుసూదన్" తాజాగా నటిస్తున్న మెగా సీరియల్ "మమతల కోవెల". ప్రముఖ నటి ప్రగతి ఈ ధారావాహికలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
  "ఈటీవీ, మాటివి, జీ తెలుగు"లో ప్రసారమైన పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన మధుసూదన్... తన కెరీర్ లో తొలిసారి... ప్రముఖ టీవీ ఛానల్ జెమినిలో టెలికాస్ట్ అయ్యే సీరియల్ లో నటించడం విశేషం.

 సూపర్ హిట్ సీరియల్స్ రూపకల్పనలో సిద్ధహస్తులైన సీనియర్ డైరెక్టర్ లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా సీరియల్ ను ప్రముఖ వ్యాపారవేత్త "సోనోపిక్స్" ప్రసాద్ నిర్మిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 7.30 గంటలకు ఈ ధారావాహిక "జెమిని"లో ప్రసారం కానుంది. ఒక నటుడిగా జెమిని టివితో తొలిసారి జత కట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు మధుసూదన్. నిర్మాత సోనోపిక్స్ ప్రసాద్, దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ లకు... ముఖ్యంగా తనను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 సీనియర్ నటీమణి ప్రగతి మాట్లాడుతూ... "మధు ఎంత మంచి నటుడో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. 'మీనా బజార్'తో వెండి తెరపై కూడా వస్తున్న మధు... సినిమా హీరోగానూ సూపర్ హిట్ అవుతాడు" అన్నారు!!