విజయవంతంగా రన్ అవుతున్న”శుక్ర”, లాభాల బాటలో చిన్న సినిమా!

యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో అరుదైన జానర్ గా చెప్పుకునే మైండ్ గేమ్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా “శుక్ర”. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించారు. గత శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాండమిక్ టైమ్ లో ధైర్యంగా “శుక్ర” సినిమాను విడుదల చేశారు నిర్మాతలు. వారి ధైర్యానికి ఫలితంగా చిత్రానికి మంచి విజయం దక్కింది. శుక్రవారం నుంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది “శుక్ర” చిత్రం. ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

దర్శకుడు సుకు పూర్వజ్ మాట్లాడుతూ… కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న టైమ్ లో ధైర్యంగా “శుక్ర” చిత్రాన్ని విడుదల చేశాం. చిన్న చిత్రాలను ఏళ్లకేళ్లు భరించే శక్తి నిర్మాతలకు ఉండదు. సినిమా మీద నమ్మకం ఒక్కటే మమ్మల్ని విడుదలకు నిర్ణయించేలా చేసింది. శుక్రవారం నుంచి అన్ని సింగిల్ స్క్రీన్స్ లో “శుక్ర” కు మంచి ఆదరణ లభిస్తోంది. యూత్, సినిమా లవర్స్ చాలా మంది సినిమా చూస్తున్నారు. “శుక్ర” సినిమాకు పెట్టిన మా ఇన్వెస్ట్ మెంట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. పాండమిక్ టైమ్ లోనూ ఓ మంచి చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. మా టీమ్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నాం. అరవింద్ కృష్ణ, శ్రీజిత ఘోష్ తమ పాత్రల్లో సూపర్బ్ గా నటించారు. వారి క్యారెక్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇతర భాషల రీమేక్, డిస్ట్రిబ్యూషన్, టెలివిజన్ రైట్స్ కోసం సంప్రదిస్తున్నారు. త్వరలో ఓటీటీలోనూ “శుక్ర” ను రిలీజ్ చేస్తాం. అన్నారు.

“శుక్ర” చిత్రాన్ని రుజాల ఎంటర్ టైన్ మెంట్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. సినిమాటోగ్రఫీ జగదీష్ బొమ్మిశెట్టి, సంగీతం ఆశీర్వాద్, రచన-దర్శకత్వం సుకు పూర్వజ్.