ఇండస్ట్రీలో నిలబడడానికి ఇదే సరైన సమయం…

పాన్ ఇండియన్ సినిమాలు సాహో, సైరా నరసింహారెడ్డి రిలీజ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వరసగా చిన్న సినిమాల సందడి మొదలు కాబోతోంది. రెండు పెద్ద సినిమాల దెబ్బకి థియేటర్స్ లేక మధ్యలో ఏ మూవీ రిలీజ్ అవడానికి డేర్ చేయలేదు. ఇక ఇప్పుడు దాదాపు రెండు నెలలు మరో బడా హీరో సినిమా విడుదలకి రెడీగా లేకపోవడంతో స్మాల్ బడ్జట్ మూవీస్ రేస్ లోకి వస్తున్నాయి. అరడజను వరకూ ఉన్న లిస్ట్ ఒకసారి చూద్దాం.

ఇప్పటికే రిలీజ్ అయిన ఎవరికీ చెప్పొద్దూ సినిమా మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది, రాబోయే రోజుల్లో దిల్ రాజు ఈ సినిమాకి థియేటర్స్ పెంచే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈషా రెబ్బ, సత్యదేవ్ నటించిన రాగాల 24గంటల్లో, సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్, రౌడీ హీరో నిర్మిస్తున్న మీకు మాత్రమే చెప్తా, రాజ్ తరుణ్ ఇద్దరిలోకం ఒకటే, రాహు, రవిబాబు ఆవిరి, ఓంకార్ రాజు గారి గది3, ఆది సాయి కుమార్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్, జార్జ్ రెడ్డి సినిమాలు వరసగా లైన్ లో ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా తెలిసీతెలియని మరో అరడజనుకు పైగా సినిమాలు అక్టోబర్ థర్డ్ వీక్ నుంచి డిసెంబర్ సెకండ్ వీక్ వరకూ క్యూ కట్టాయి. ఈ తాకిడి కాస్త తగ్గగానే మాస్ రాజా రవితేజ, నట సింహం బాలయ్య ట్రాక్ లోకి వచ్చేస్తున్నారు. దానికి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటి వరకూ కంటెంట్ ఉన్న సినిమాలదే హవా. సరైన హిట్ కొడితే ఇండస్ట్రీ మొత్తం తిరిగి చూసేలా చెయ్యొచ్చు.