సత్యదేవ్ – నిత్యమీనన్ తో కలిసి అంతరిక్షం లోకి…

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యి సోలో హీరోగా ఫుల్ బిజీ అయిన యాక్టర్ సత్యదేవ్. మంచి కంటెంట్ ఉండే సినిమాలని చేస్తే వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. కథకి కథకి మధ్య వేరిఎషణ్ చూపిస్తున్న సత్య దేవ్, ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ జనరేషన్ మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అనే కాంప్లిమెంట్ అందుకుంటున్న సత్యదేవ్, టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్కై-ఫై జనార్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి స్కైలాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆదివారం “స్కైలాబ్” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మిల్క్ బ్యూటీ తమన్నా విడుదలచేశారు.

Skylab: movie title and first look released by Tamanna

1979 లో జరిగిన స్కైలాబ్ ఘటన ఆధారంగా దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమెరికా మొదటి అంతరిక్ష కేంద్రమైన స్కైలాబ్ భూమిపై పడినప్పుడు బండలింగంపల్లిలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. బైట్, నిత్యామీనన్ ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సత్యదేవ్ నిత్యమీనన్ రాహుల్ రామకృష్ణ ముగ్గురూ అంతరిక్షంలో నుండి పడిపోతున్న ఉపగ్రహంపై కూర్చున్న ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. తమన్నా ఈ పోస్టర్ విడుదల చేస్తూ సినిమా చూడాలని చాలా తొందరగా ఉంది, కాంట్ఎ వెయిట్క్కు అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సత్యదేవ్ తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం, గాడ్సే చిత్రాలలో నటిస్తున్నారు.