నాన్న టాలీవుడ్ సూపర్ స్టార్, కూతురు హాలీవుడ్ డబ్బింగ్ స్టార్

2013లో వచ్చిన అమెరికన్ యానిమేటెడ్ మూవీ ఫ్రోజెన్. ఆరేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న మూవీ ఫ్రోజెన్ 2. వాల్ట్ డిస్నీ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫ్రోజెన్ 2 సినిమాని క్రిస్ బక్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఫ్రోజెన్ 2 ట్రైలర్ రిలీజ్ అయ్యి సినీ అభిమానులని ఆకట్టుకుంది. ఇంగ్లీష్ తో పాటు హిందీ తమిళ తెలుగు భాషల్లో నవంబర్ 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఫ్రోజెన్ 2 తెలుగు వెర్షన్ లోని మెయిన్ క్యారెక్టర్ అయిన ఎల్సా పాత్రకి ఘట్టమనేని సితార డబ్బింగ్ చెప్పనుంది. క్లాసికల్ డాన్సర్ గా, సూపర్ స్టార్ కూతురిగా ఇప్పటికే స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న సితార ఇప్పుడు హాలీవుడ్ సినిమాకి డబ్బింగ్ చెప్తుండడం ఘట్టమనేని అభిమానులకి స్పెషల్ న్యూస్ అయ్యింది. త్వరలో సితార వాయిస్ ఉన్న ఫ్రోజెన్ 2 తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది.