హైదరాబాద్ లో నేడు పునః ప్రారంభమైన ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రాలు…

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘.

చిత్రం చివరి షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. చిత్ర నాయకా, నాయికలు ‘నాగ శౌర్య ,రీతువర్మ’ లపై ఓ సందర్భోచిత గీతాన్ని నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ నేతృత్వంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య చిత్రీకరిస్తున్నారు. ఈ గీతం తో పాటు మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణతో త్వరలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు. ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్ సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశి

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

సిద్ధు జొన్నలగడ్డ ‘నరుడి బ్రతుకు నటన’… సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం. హైదరాబాద్ లో ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం షూటింగ్ ఈరోజు పునః ప్రారంభం అయింది. కథానాయకుడు సిద్దు పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా,‘నేహాశెట్టి‘ నాయికగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి రచయిత గానూ,దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు దర్శకుడు విమల్ కృష్ణ.

చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు.

‘నరుడి బ్రతుకు నటన‘ చిత్రానికి
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంటోని
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ