
ప్రస్తుతానికి సినిమాలు థియేటర్లో ఆడుతూ వసూలు చేయడం అనేది ఎంతో కష్టంగా మారింది. ఇటువంటి కష్ట సమయంలో కూడా శ్రీ విష్ణు హీరోగా నటించిన #సింగిల్ చిత్రం మంచి వసూలు సాధిస్తూ ముందుకు వెళుతుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్యా కొప్పినీడు, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలుగా మీ పదవ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం సింగిల్. ఈ చిత్రంలో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు తో పాటు జంటగా కీర్తిక శర్మ, ఇవాళ నటించారు. వెన్నెల కిషోర్ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ముందుకు వెళ్లే దిశగా ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన ప్రత్యేకత చాటుకున్నాడు శ్రీ విష్ణు. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా తన ట్యాగుకు తగ్గట్లు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా తన ట్యాగ్ కు న్యాయం చేశారు.