డ్రీమ్ రోల్ గురించి బయట పెట్టిన #సింగిల్ హీరోయిన్ కేతిక శర్మ

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. #సింగిల్ మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కేతిక శర్మ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ ప్రాజెక్టు లోకి ఎలా వచ్చారు ? గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-గీతా ఆర్ట్స్ సంస్థలో వర్క్ చేయాలని ఎప్పటినుంచో నా కోరిక. అల్లు అరవింద్ గారు ఒక సినిమాని ప్రజెంట్ చేస్తుంటారంటే కచ్చితంగా ఆ సినిమాలో అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంటుంది. ఈ సినిమా గురించి నాకు కాల్ వచ్చినప్పుడు ఫైనల్ గా గీత ఆర్ట్స్ లో  వర్క్ చేస్తున్నాననే ఆనందం కలిగింది. కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇది వెరీ ఫన్ ఫిల్డ్ ఫిలిం. పర్ఫెక్ట్ స్టార్ కాస్ట్ తో వస్తున్న వెరీగుడ్ ఎంటర్టైనర్.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఈ సినిమాలో పూర్వా అనే క్యారెక్టర్ లో కనిపిస్తాను. తను వెరీ ఇండిపెండెంట్, ప్రాక్టికల్ గర్ల్. ఈ కథలో ఎమోషన్ నా క్యారెక్టర్ ద్వారానే వస్తుంది. కొన్ని సీరియస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమా లవ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా క్యారెక్టర్ వెరీ రిలేటబుల్ గా ఉంటుంది.

శ్రీ విష్ణు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-శ్రీ విష్ణు గారు వండర్ఫుల్ పర్సన్ చాలా సింపుల్, చాలా హంబుల్ గా ఉంటారు. యాక్టింగ్ లో కూడా చాలా సపోర్ట్ చేశారు. శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది.  ఆయన స్పాట్లో డైలాగ్స్ ఇంప్రవైజ్ చేసేస్తుంటారు. ఆయన పర్ఫార్మెన్స్ చాలా స్పాంటేనియస్ గా ఉంటుంది. ఆయనతో వర్క్ చేయడం రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్.

ఇవానాతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-ఇవానా వెరీ బ్యూటిఫుల్ అండ్ గర్ల్. ఆన్ స్క్రీన్ లో మా మధ్య ఒకటి రెండు సీన్స్ ఉన్నాయి. అయితే ఆఫ్ స్క్రీన్ లో మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తను చాలా పాజిటివ్ పర్సన్.

రాబిన్ వుడ్ లో మీరు చేసిన అదిదా సర్ప్రైజ్ పాట వైరల్ అయింది..  మరి ఇందులో అలాంటి డాన్స్ నెంబరు ఉందా ?
-అదిదా  సర్ప్రైజ్ పాట వైరల్ కావడం చాలా హ్యాపీనెస్ ని ఇచ్చింది. సింగిల్ లో అలాంటి డాన్సింగ్ నెంబర్ ఏమీ లేదు. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్. వెల్ ప్యాకెజ్ సూపర్ ఎంటర్టైనింగ్ ఫిలిం. సినిమా చూస్తున్నంత సేపు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు .

డైరెక్టర్ కార్తీక్ రాజు గారి గురించి…
-కార్తీక్ గారు వెరీ ఫ్యాషనైట్ ఫిలిం మేకర్. ఆయనకి చాలా క్లియర్ విజన్ ఉంది. ఆయనకు ఏం కావాలో క్లారిటీ ఉంటుంది. ఈ సినిమాని హైలీ ఎంటర్టైనింగ్ మూవీ గా తీర్చిదిద్దారు. ఆయన సెట్లో అందర్నీ చాలా కంఫర్టబుల్ గా చూసుకుంటారు.

మీ కెరీర్ పట్ల ఆనందంగా ఉన్నారా ?
-నా కెరీర్ పట్ల చాలా ఆనందంగా ఉన్నాను . గెలుపోటములో మన చేతిలో ఉండవు. వర్క్ చేయడం ఒక్కటే మన చేతిలో ఉంటుంది. రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా నేనెప్పుడూ కెరీర్ ని సెలబ్రేట్ చేసుకోవాలనే చూస్తుంటాను. నిజంగా ఒక నటిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తాను.

మీకు ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా?
-గీత ఆర్ట్స్ లో రాబోతున్న రష్మిక మందన గారి గర్ల్ ఫ్రెండ్ సినిమాలో లాంటి సినిమా చేయాలని ఉంది. అందులో రస్మిక గారి క్యారెక్టర్ వెరీ బ్యూటిఫుల్. అలాంటి క్యారెక్టర్ చేయడం నా డ్రీమ్. అలాగే సాయి పల్లవి గారు, కీర్తి సురేష్ గారు చేస్తున్నట్లు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కూడా చేయాలని ఉంది.

ఈ సినిమా చేస్తున్నప్పుడు కష్టమైన సీన్ ఏదైనా అనిపించిందా?
-కామెడీ చాలా డిఫికల్ట్.  కామెడీ చేయడం అంత ఈజీ కాదు. ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. శ్రీ విష్ణు గారి టైమింగ్ మ్యాచ్ చేయడం వెరీ డిఫికల్ట్.

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి?
-హిందీలో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే తమిళ్ తెలుగు బైలింగ్వల్ ఒకటి చేస్తున్నాను. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి మేకర్స్ రివిల్ చేస్తారు.

సింగిల్  గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు?
-సింగిల్ మే 9న రిలీజ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో కలిసి ధియేటర్స్ కి రండి. ఇది సమ్మర్ రొమాంటిక్ కామెడీ ఆఫ్ ద ఇయర్. ప్రేక్షకులకి కావలసిన నవ్వులు పంచే సినిమా.