రోడ్డు ప్రమాదానికి గురైన సింగర్ యేసుదాస్ తనయుడు..

ప్రముఖ దిగ్గజ గాయకుడు డాక్టర్ కె.జె. యేసుదాస్ కుమారుడు విజయ్ యేసుదాస్ అలప్పుజలో ఒక ప్రమాదానికి గురయ్యారు. నివేదిక ప్రకారం, గాయకుడి కారు సోమవారం (నవంబర్ 2, 2020) నేషనల్ హై వేలో అలప్పుజలోని తురవూర్లో వస్తున్న మరో వాహనాన్ని డీకొట్టింది. అయితే, విజయ్ యేసుదాస్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతనికి ఎటువంటి గాయాలు కాలేదు.

గాయకుడు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, అతను ఒక స్నేహితుడితో కలిసి కొచ్చికి వెళుతున్నాడు. అయితే అనుకోకుండా మార్గం మధ్యలో అదుపుతప్పి మారొకారును డీ కొట్టడంతో ప్రమాదం సంభవించిందని, ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. క్షేమంగా ఉన్న విజయ్ యేసుదాస్ మరియు అతని స్నేహితుడు మరొక కారులో తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు కూడా స్పందించి ఎలాంటి ప్రమాదం జరగలేదని మీడియాకు క్లారిటీ ఇచ్చారు.