Tollywood: నా మీద‌నే ట్రోల్స్ చేస్తారు..ఆ పై మ‌హిళా దినోత్స‌వం శుభాకాంక్ష‌లు: సునీత సెటైర్

Tollywood: ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత, మ్యాంగో రామ్ వీర‌ప‌నేనిని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆమెకు రెండో వివాహం కాగా.. ఆమె ఇప్పుడు ఎంతో సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తుంది. అయితే నేడు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆమె త‌న ఇన్‌స్టా వేదిక‌గా ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. నా జీవితాన్ని మీరే నిర్ణ‌యిస్తారు. ట్రోల్స్ చేస్తారు. న‌న్ను ప్ర‌తిసారీ కింద‌కు లాగుతుంటారు.. నాలో అభ‌ద్ర‌తాభావాన్ని నెల‌కొల్పుతుంటారు. అలాగే ఎప్పుడూ మీరు న‌న్ను నమ్మ‌రు. నాకు అండగా నిల‌వ‌రు. ఆఖ‌రికి నేను చెప్పేది కూడా విన‌రు.

Singer sunitha

నేను ఓడిపోయిన‌ప్పుడు న‌న్ను చూసి న‌వ్వుతుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. ఎలాంటి కార‌ణం లేకుండా న‌న్ను నిందించిన మీరే ఇప్పుడు నాకు మ‌హిళ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెబుతున్నారా?.. నేను మీ శుభాకాంక్ష‌లు స్వీక‌రిస్తున్నాను. ఎందుకంటే మీరు నాపై విసిరిన రాళ్లేనే పునాదులుగా మార్చుకుని నా బ‌లాన్ని మ‌రింత పెంచుకుని.. జీవితంలో ముందుకు సాగుతున్నాను. చిరున‌వ్వుతో అన్నింటినీ క్ష‌మించాను.. అలాగే ప్రేమ‌ను పంచాను… ఎందుకంటే నేను ఒక స్త్రీని అన్నింటినీ స‌హించాను. మ‌హిళ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ Tollywood సునీత పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతుంది.