ఎప్పుడో సూసైడ్ చేసుకునేదాన్ని!

టాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత కెరీర్ ప‌రంగా సూప‌ర్ స‌క్సెస్ అయిన‌ప్ప‌టికీ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నారు. సునీత టీనేజ్‌లోనే వ‌రుస‌గా సినిమాల్లో పాట‌లు పాడే అవ‌కాశాల‌ను అందుకున్నారు. అలాగే చాలా మంది హీరోయిన్ల‌కు డ‌బ్బింగ్ కూడా చెప్పారు. ఇలా ఫుల్ బిజీగా ఉన్న స‌మ‌యంలోనే ఆమెకు వివాహం నిశ్చ‌య‌మైంది. 19ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు ఆమె కిర‌ణ్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు జ‌న్మించారు. కానీ చాలా ఏళ్ల పాటు స‌జావుగా సాగిన త‌న వైవాహిక జీవితానికి పుల్‌స్టాప్ పెట్టారు సునీత‌. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకుని దూర‌మైపోగా.. అప్ప‌టినుంచి ఆమె ఒంట‌రిగా జీవిస్తూ.. క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ సినిమాల్లో పాట‌లు పాడుతూ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను పోషిస్తున్నారు. సుదీర్ఘ‌మైన కెరీర్‌లో సునీత ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు.

SINGER SUNITHA MARRIAGE

అయితే ఈ మ‌ధ్య కాలంలో సునీత పెళ్లి విష‌యం సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీర‌ప‌నేనితో సునీత ఇటీవ‌లే ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. అయితే వీరిద్ద‌రి వివాహం గ‌త నెల‌లోనే జ‌ర‌గాల్సి ఉండ‌గా కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. రేపు వీరి వివాహం అతి కొద్ది మంది బంధు మిత్రుల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌బోతుంది. ఇదిలాఉంటే.. కొద్దిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునీత మాట్లాడుతూ.. త‌న‌కు ఎవ‌రి విష‌యంలోనూ జెల‌సీ ఉండ‌దని, తాను కొంద‌రి విష‌యంలో మాత్ర‌మే జెల‌సీ ఉంటాన‌ని సునీత తెలిపింది. గ‌తంలో సింగ‌ర్ ఉష‌తో వివాదం గురించి అడగ్గా.. త‌న‌కు ఎవ‌రితో వివాదాలు లేవ‌ని.. నాకు ఎవ‌రిపైనా జెల‌సీ ఉండ‌దు.. ఒక‌వేళ అలాంటి ఫీలింగ్సే నాకు ఉంటే ఎప్పుడో ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోయేదాన్నాన‌‌ని అన్నారు. అలాగే నా జీవితంలో ఎదురైన‌ వివాదాల‌ను ప‌ట్టించుకోకుండా నా ప‌ని నేను చేసుకుంటూ వెళ్లాను. ఇవ‌న్నీ ప‌ట్టించుకోను కాబ‌ట్టే ప్ర‌స్తుతం ఇలా ఉన్నాన‌ని అంటూ చెప్పుకొచ్చింది.