Kollywood: ప్రముఖ సింగర్ చిన్మయి కోలీవుడ్ ఇండస్ట్రీపై మీటూ ఆరోపణలు చేసినందుకు ఆమెను బ్యాన్ చేశారట. 2018లో ప్రముఖ సింగర్ కార్తిక్, వైరముత్తులు తనని మానసిక వేధింపులకు గురిచేశారని ఆరోపణలు చేసింది చిన్మయి. ఈ విషయంపై తాజాగా చిన్మయి ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుపుతూ.. మీటూ ఉద్యమం వేదికగా వేధింపులకు గురిచేసిన వారి పేర్లను బయటపెట్టినందుకు 2018 అక్టోబర్ నుంచి రాధారవి, వైరముత్తు..Kollywood కోలీవుడ్ పరిశ్రమలో నన్ను బ్యాన్ చేశారు.
రాధారవి నాయకత్వంలోని డబ్బింగ్ యూనియన్ నన్ను నిషేధించింది. నేను దీనిపై చట్టబద్ధంగా పోరాడుతున్నాను. వేధించిన వాళ్ల పేరు బయటపెట్టడం నేరం కాదు. పలు ఆరోపణలు ఉన్నప్పటికీ వైరముత్తు, రాధారవి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అనుభవిస్తున్నారు. దేవుడి దయ వల్ల తెలుగు, హిందీ, ఇతర సినీ పరిశ్రమల్లో గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాను. నన్ను అర్థం చేసుకునే భర్త, కుటుంబం ఉండడం నా అదృష్టం అని తెలిపింది చిన్మయి.