ఎన్టీఆర్‌కు విలన్‌గా తమిళ స్టార్ హీరో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ జరుగుతుండగా.. ఇది ముగిసిన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాగా.. దీనికి ‘పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది.

SIMBU VILLEN IN NTR

ఇందులో తమిళ స్టార్ హీరో శింబు విలన్‌గా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో ఒక డిఫరెంట్ విలన్ రోల్‌లో నటించనున్నాడని వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనుండగా.. ఒక హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకోనున్నారని సమాచారం. ఒక మరో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి వరీనా హుసేన్‌ను తీసుకోనున్నారని తెలుస్తోంది.