‘జాక్’ చిత్ర రివ్యూ

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్ పై సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తూ నేడు విడుదలైన చిత్రం జాక్. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, రవి ప్రకాష్, రాహుల్ దేవ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్యామ్ సి ఎస్, అచ్చు రాజమణి సంగీతాన్ని అందించగా వినయ్ కే చక్రవర్తి సినిమా గా పని చేశారు. నవీనుడి ఎడిటింగ్ పని చేశారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
ఇటువంటి పనిలోనూ సక్సెస్ కాదు అనే ధోరణిలో అందరూ సిద్ధూ జొన్నలగడ్డ (జాక్) ను అంటుండగా తన తల్లి మాత్రం తనని నమ్ముతుంది. అయితే తన కొడుకు జన్మదిన ఉత్సాహంలో తండ్రి నరేష్ ఉంటాడు. ఆ విషయంపై ఒక స్పై ఏజెన్సీని కూడా చెడగొడుతుంది. అయితే ఆ స్పై ఏజెన్సీ వాళ్ళు జాక్ ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని కనుకుంటారా లేదా? జాక్ జీవితంలోకి వైష్ణవి చైతన్య ఎలా వస్తుంది? తన పాత్ర చిత్రంలో ఎలా ఉండబోతుంది అలాగే జాక్ తో ఎంతవరకు ప్రయాణం చేస్తుంది? టైలర్ లో చూపించినట్లు జాక్ రాలో పనిచేస్తున్నాడా లేక రా వారికి ఛాలెంజ్గా నిలిచాడా? అసలు ఈ రా వల్ల జాతి జీవితంలో వచ్చే మార్పులు ఏంటి? ప్రకాష్ రాజు కు జార్తో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? చివరికి జాక్ ఏమవుతాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తెరపై చిత్రం చూడాల్సిందే.

నటీనటుల నటన:
ఈ చిత్రంలో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ నటన ఇప్పటికే టిల్లు చిత్రాలలో చూసిందే. ఈ చిత్రంలో కూడా తన నటన ఇంకా బాడీ లాంగ్వేజ్ పూర్తిగా అదేవిధంగా ఉన్నాయి. అదేవిధంగా చిత్రంలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య పెర్ఫార్మన్స్ వరకు ఎంతో బాగుంది. తన పాత్రకు తగ్గట్లు తాను నటిస్తూ ముందుకు వెళ్ళింది. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఒకసారి ఏజెంట్గా ఆయన పూర్తి పర్ఫామెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే చిత్రంలో తండ్రి పాత్రలు పోషించిన నరేష్, బ్రహ్మాజీ చాలా సెటిల్ గా పెర్ఫాం చేశారు. అలాగే ఇతర పాత్రల పోషించిన రవి ప్రకాష్, రాహుల్ దేవ్ తదితరులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేస్తూ నటించడం జరిగింది. చిత్రంలో మంచి డైలాగ్స్ డెలివరీ ఇంకా పర్ఫామెన్స్ తో సిద్దు జొన్నలగడ్డ చిత్రానికి పెద్ద బోనస్గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ:
కథ విషయానికి వస్తే బొమ్మరిల్లు భాస్కర్ తన రెగ్యులర్ ట్రాక్ నుండి కొంచెం బయటికి వచ్చి కొత్తగా ట్రై చేసినట్లు అర్థమవుతుంది. అయితే స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండటంతో చిత్రం అంతగా తనట్టు కాకుండా మొదటి ఆఫ్ లో కొంచెం సాగుతూ పోతుంది అనేది ఫీలింగ్ ఉండవచ్చు. సంగీతం ఇంకా పాటలు బాగానే ఉన్నాయి. నటీనటుల నుండి పూర్తి పర్ఫామెన్స్ తీసుకోవడంలో దర్శకుడు సక్సెస్ గా చెప్పుకోవాలి. కలరింగ్ ఇంకా లొకేషన్స్ బాగున్నాయి. హైదరాబాద్, నేపాల్ లో చాలావరకు రియల్ లోకేషన్ లో చూసినట్లుగా తెలుస్తుంది. చిత్రంలో లవ్ ట్రాక్ అంతగా ఇంపాక్ట్ చూపించలేదని చెప్పుకోవాలి. కొన్నిచోట్ల అనవసరమైన కామెడీ ఇంకా లవ్ సీన్లు అతను పక్కకు పట్టించేలా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నటీనటుల నటన, డైలాగ్స్, సంగీతం, సిద్దు జొన్నలగడ్డ, ప్రకాష్ రాజ్ నటన బోనస్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ కథ, అనవసరమైన కొన్ని లవ్ సీన్స్, కొంత కామెడీ.

సారాంశం :
సిద్దు జొన్నలగడ్డ చిత్రం అంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది అనుకుంటారో అంత ఎంటర్టైన్మెంట్ తో పూర్తిగా సిద్దు జొన్నల కట్ట ఘటనతో మార్క్ రూపు దిద్దుకుంటూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంది.