కార్గిల్ వార్ ని ట్రైలర్ లోనే కళ్ళకి కట్టినట్లు చూపించారు

1999 కార్గిల్ యుద్ధంలో పరం వీర్ చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం, ప్రయాణాన్ని ‘షెర్షా’లో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో బాత్రా పాత్రను సిద్దార్థ్ మల్హోత్రా ప్లే చేశాడు. ‘పంజా’ ఫేమ్ విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. కరణ్ జోహార్ ప్రొడక్షన్ బ్యానర్ ధర్మ ఎంటర్టైన్మెంట్, కాష్ ఎంటర్టైన్మెంట్ ‘షెర్షా’ను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఆగస్టు 12న ఈ చిత్రం ప్రీమియర్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఇటివలే మేకర్స్ షేర్షా టీజర్ ని రిలీజ్ చేశారు. కార్గిల్ వార్ హీరో విక్రమ్ బాత్రా ఒరిజినల్ ఫుటేజ్ ని వాడుతూ కట్ చేసిన ఈ టీజర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. విక్రమ్ బాత్రా లైఫ్ ని, కార్గిల్ వార్ లో ఆ వీరుడు మన జెండాని ఎగరేయడానికి చేసిన పోరాటాన్ని ట్రైలర్ లో చూపించారు. విక్రమ్ గా సిద్దార్థ్ పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యాడు. ట్రైలర్ లో చూపించిన వార్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉన్నాయి. విష్ణు వర్ధన్ స్టైలిష్ మేకింగ్ ఈ మూవీకి బాగా హెల్ప్ అయ్యింది. షెర్షా సినిమాకి పోటిగా స్టార్ హీరోగా అజయ్ దేవగన్ నటించిన భుజ్ మూవీ రిలీజ్ కానుంది. రెండు ఆర్మీ బేస్డ్ కథలే అయినా ఒకటి అమెజాన్ ప్రైమ్ లో, ఇంకొకటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కావడం విశేషం. ఈ ఇండిపెండెన్స్ డే సంధర్భంగా ఈ రెండు మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి.

Shershaah - Official Trailer | Vishnu Varadhan | Sidharth Malhotra, Kiara Advani | Aug 12