Bollywood: సెక్స్ వ‌ర్క‌ర్‌గా శ్వేతాబ‌సు.. రెడ్ లైట్ ఏరియాకు వెళ్లొచ్చిన చిత్ర‌బృందం!

Bollywood: టాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ సందేశ్ న‌టించిన కొత్త బంగారులోకం చిత్రంలో శ్వేతా బ‌సుప్రసాద్ హీరోయిన్‌గా న‌టించి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో శ్వేతా బ‌సుప్ర‌సాద్ ఎకడా, ఎపుడు అంటూ డైలాగ్‌తో కుర్ర‌కారును మ‌తులు పోగ‌ట్టేసింది. ఇక ఈ సినిమా త‌ర్వాత సినిమాలు పెద్ద‌గా ఏమీ లేవు.. అయితే ఈ క్ర‌మంలోనే శ్వేతా సెక్స్ రాకెట్‌లో ప‌ట్టుబ‌డ‌డంతో ఆమె కెరీర్ త‌ల‌కిందులైంది. ఈ కేసులో కొంత కాలం పాటు కొన‌సాగిన‌.. శ్వేతా నిర్దోశిగా తీర్పు ఇచ్చింది. ఇక అనంత‌రం ఆమె 2018లో డిసెంబ‌ర్ 13న బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్ మిట్ట‌ల్న్ను వివాహం చేసుకుంది. కానీ.. సంవ‌త్స‌రంలోనే వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నారు.

ఈ విష‌యంపై తాజాగా శ్వేతాబ‌సుప్ర‌సాద్ స్పందించ‌గా.. తామిద్ద‌రం ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే విడిపోయామ‌ని, దీనిని విడాకులు అనే బ‌దులు బ్రేక‌ప్ అయింద‌ని చెప్ప‌డం బెట‌ర్ అని అన్నారు శ్వేతా. ఇక శ్వేతాబ‌సుప్ర‌సాద్ ప్ర‌స్తుతం Bollywood బాలీవుడ్‌లో ఇండియా లాక్‌డౌన్ చిత్రంలో న‌టిస్తుంది. ఈ చిత్రంలో సెక్స్‌వ‌ర్క‌ర్ మెహ్రునిస్సా పాత్ర‌లో క‌నిపించ‌నుంది శ్వేతా. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మ‌ధుర్ బండార్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. లాక్‌డౌన్ వ‌ల్ల ప‌లు రంగాలు ఆర్థికంగా దెబ్బ‌తిన్నార‌ని విష‌యం తెలిసిందే. అయితే ముంబైలోని రెడ్‌లైట్ ఏరియాలో నివ‌సించే సెక్స్ వ‌ర్క‌ర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలో వారు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు అని స్వ‌యంగా తెలుసుకోవాల‌నుకున్నBollywood చిత్ర‌బృందం.. ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో కామాటిపుర‌ను వెళ్లింది. దీనిపై శ్వేతాబ‌సుప్ర‌సాద్ స్పందించింది.. తాను చేసే పాత్ర‌లు నిజ‌మ‌ని న‌మ్ముతాను.. అందుకు ఆ పాత్ర‌ల్లో లీన‌మైపోతా. లేక‌పోతే ప్రేక్ష‌కులు ఆ పాత్ర‌ను అర్థం చేసుకోరు. అందుకే నా పాత్ర కోసం మ‌ధుర్ స‌ర్‌తో నా టీమ్‌, రెండు వారాల క్రితం రెడ్ లైట్ ఏరియా కామాటిపురంకు వెళ్లాం అని తెలిపింది శ్వేతాబ‌సుప్ర‌సాద్‌. అలాగే తాను చేయ‌బోయే Bollywood ఈ చిత్రంలోని మెహ్రునిస్సా పాత్ర‌.. నిజంగా ఆమెను మేము క‌లిశాం.. అచ్చంగా నా పాత్ర క‌ళ్ల ముందే క‌నిపించినట్ట‌యింది అని శ్వేతా పేర్కొంది.