పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ చేయవద్దు.. శృతి ఘాటు వ్యాఖ్యలు

ఇటీవల వచ్చిన క్రాక్ సినిమాతో హిట్‌ను అందుకున్న హీరోయిన్ శృతిహాసన్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో తొలిసారిగా ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని గోదావరిఖనిలో జరుగుతుండగా.. త్వరలో ఇక్కడ ప్రభాస్-శృతిహాసన్ మధ్య కొన్ని సీన్స్ తెరకెక్కించనున్నారు.

shruti haasan love affires

అయితే ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శృతి ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా శృతి స్పందించింది. ప్రస్తుతం తాను వృత్తిపరమైన జీవితంపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నానని కాబట్టి అందరూ కూడా దాని గురించే మాట్లాడితే బాగుంటుందని వ్యాఖ్యానించింది.అందరూ దాని గురించే మాట్లాడితే సమస్యలు ఉండవంది. పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ చేయవద్దని, వృతిపరమైన విషయాలు మాట్లాడుకుందామంది.