రవితేజ చిత్రంతో టాలీవుడ్‌లో శ్రుతి హాసన్ రీ ఎంట్రీ

గత 20 నెలల నుండి సినిమాలకి దూరంగా ఉంటున్న శృతి హాసన్ చాలా గ్యాప్ తరువాత, ఒక తెలుగు చిత్రానికి సంతకం చేశారు. గోవిచంద్ మలినేని దర్శకత్వం వహించబోయే కొత్త యాక్షన్ ఎంటర్టైనర్లో రవితేజ సరసన ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హీరో రవితేజ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఇంతకు ముందు బలుపు అనే చిత్రం చేసిన శృతి అదే కాంబినేషన్ లో తిరిగి తన టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుంది.

గత 20 నెలల్లో శ్రుతి హాసన్ సైన్ చేసిన మొదటి చిత్రం ఇది. ఆరోగ్య కారణాల వల్ల ఆమె సినిమాలకి దూరం అవ్వవలసి వచ్చిందని ”ఫీట్ అప్ విత్ స్టార్స్” అనే టాక్ షోలో శృతి చెప్పింది. శృతి తెలుగులో సినిమా చేస్తుందని తెలిసిన ఆమె అభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.