‘డకాయిట్’ షూటింగ్‌లో జాయిన్ అయిన శృతి హాసన్

అడివి శేష్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.  హీరోయిన్‌గా నటిస్తున్న శ్రుతిహాసన్ ఈ షెడ్యూల్‌లో టీమ్‌తో జాయిన్ అయింది. ఈ ఇంపార్ట్టెంట్, మ్యాసీవ్ యాక్షన్ షెడ్యూల్‌లో మేకర్స్ లీడ్ కాస్ట్ పై కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా శృతి హాసన్, శేష్‌తో సెల్ఫీని షేర్ చేశారు.  

డకాయిట్ ఇద్దరు మాజీ ప్రేమికుల కథ, వారు తమ లైఫ్స్ ని మార్చడానికి వరుస దోపిడీలకు ఏకం కావాలి. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు డివోపీగా పనిచేసిన షానీల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. శేష్, శ్రుతి జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ప్రాజెక్ట్‌ను సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్ చేస్తోంది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.

అడివి శేష్, షానీల్ డియో ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రం 2022లో ప్రశంసలు పొందిన ‘మేజర్’ తర్వాత శేష్ యొక్క సెకెండ్ స్ట్రయిట్ హిందీ మూవీ. ఇప్పటికే వచ్చిన డెకాయిట్ గ్లిమ్ప్స్ మంచి బజ్ వచ్చేలా చేసింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

నటీనటులు: అడివి శేష్, శృతి హాసన్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: షానీల్ డియో
కథ, స్క్రీన్‌ప్లే: అడివి శేష్, షానీల్ డియో
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
సహ నిర్మాత: సునీల్ నారంగ్
సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో: వంశీ-శేఖర్