తల్లి పాత్రల్లో నటిస్తానంటున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్

కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌హాసన్ నటవారసురాలిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. తెలుగులో ఇటీవల విడుదలైన మాస్ మహారాజా హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న వకీల్ సాబ్ సినిమాలో కూడా శృతిహాసన్ కీలక పాత్రలలో నటించింది.

shruti haasan mother character

అయితే తాజాగా శృతిహాసన్ సంచలన కామెంట్స్ చేసింది. కథ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా తల్లిపాత్రల్లో నటిస్తానని చెప్పింది. తల్లి పాత్రల్లో నటించడం వల్ల హీరోయిన్ కెరీర్‌కి ఎలాంటి ఆటంకాలు రావని భావిస్తున్నానని, తాను ధరించే పాత్ర కీలకంగా ఉండటంతో పాటు కథతో అనుసంధానమై ఉంటే మున్ముందు కూడా అమ్మ పాత్రల్లో నటిస్తానంది. ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తెలిపింది.