Shruti Haasan In Salaar: ప్రభాస్‌తో శృతిహాసన్‌ రోమాన్స్

Shruti Haasan In Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘సలార్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత వారంలోనే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరగ్గా.. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించనుందని ప్రచారం జరిగింది.

shruti haasan in salaar

కానీ తాజా సమాచారం ప్రకారం.. ఇందులో చెన్నై బ్యూటీ శృతిహాసన్ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఇటీవలే శృతిహాసన్‌ని కలిసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. పాత్ర గురించి వివరించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ సరసన నటించేందుకు శృతిహాసన్ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. ప్రభాస్-శృతిహాసన్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కలిసి నటించలేదు. దీంతో ఈ కాంబినేషన్‌లో అయితే కొత్తగా ఉంటుందని ప్రశాంత్ నీల్ భావించినట్లు తెలుస్తోంది.